ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: నిర్వహణ పనులతో పలు రైళ్ల రద్దు

ABN, Publish Date - Feb 18 , 2025 | 04:31 AM

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలోని పలు సెక్షన్లలో నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశామని, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్‌ చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారి సీపీఆర్‌ఓ శ్రీధర్‌ ప్రకటించారు.

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలోని పలు సెక్షన్లలో నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశామని, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్‌ చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారి సీపీఆర్‌ఓ శ్రీధర్‌ ప్రకటించారు. ఆలేరు-పెంబర్తి స్టేషన్ల మధ్య ట్రాక్‌ మరమ్మతులు జరుగుతున్నందున ఈ నెల 17న సికింద్రాబాద్‌-భద్రాచలం,18న భద్రాచలం-సికింద్రాబాద్‌ (17659/17660) రైళ్లు రద్దయ్యాయని తెలిపారు.


మరోవైపు సోమవారం గోరఖ్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా యశ్వంత్‌పూర్‌ వెళ్లాల్సిన సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 2 గంటలు, నిజాముద్దీన్‌ నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన దురంతో ఎక్స్‌ప్రె్‌సను గంటన్నర పాటు రీషెడ్యూల్‌ చేసినట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో చేపట్టనున్న నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 23న సిద్దిపేట్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-సిద్దిపేట్‌ (77656/77653) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

Updated Date - Feb 18 , 2025 | 04:31 AM