ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత కిషన్‌రెడ్డిదే

ABN, Publish Date - Feb 28 , 2025 | 03:52 AM

తెలంగాణకు ప్రతి ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిదేనని, లేనట్లయితే భవిష్యత్తులో తీవ్ర పోరాటాలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు.

  • లేనట్లయితే తీవ్ర పోరాటాలు తప్పవు: మంత్రి పొన్నం

హుస్నాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ప్రతి ప్రాజెక్టును కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిదేనని, లేనట్లయితే భవిష్యత్తులో తీవ్ర పోరాటాలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై తమను సంప్రదించలేదని, ఈ రాష్ట్రానికి ఏం కావాలో అడగలేదని కేంద్ర ప్రభుత్వం కారణాలు చూపి పదేళ్లుగా పట్టించుకోలేదన్నారు.


రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మెట్రో రైలు మలిదశ, మూసీ, ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, హైదరాబాద్‌లో తాగునీటి సమస్య వంటి అనేక ప్రాజెక్టులపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల మంజూరు కోసం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తామూ కేంద్రం చుట్టూ తిరుగుతున్నామని ఆయన చెప్పారు.

Updated Date - Feb 28 , 2025 | 03:52 AM