Ponnam Prabhakar: ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి
ABN, Publish Date - Jan 26 , 2025 | 03:53 AM
శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మునిసిపాలిటీలో రూ.1.30కోట్లు, మహేశ్వరంలో రూ.1.65 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రజల హక్కు: పొన్నం
మహేశ్వరం/ఎల్‌బీనగర్, జనవరి 25 (ఆంద్రజ్యోతి): ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై లేనిపోని రాద్ధాంతాలు చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మునిసిపాలిటీలో రూ.1.30కోట్లు, మహేశ్వరంలో రూ.1.65 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రం పదేళ్ల దొరల గడిలో బందీగా ఉండిపోయిందని, ఇప్పుడు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు.
Updated Date - Jan 26 , 2025 | 03:53 AM