ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 20 మంది మృతి

ABN, Publish Date - Jan 05 , 2025 | 03:38 AM

రోడ్డు ప్రమాదాల్లో ప్రతి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

  • రోడ్డు భద్రతపై అవగాహన కల్పించండి

  • కలెక్టర్లతో సమీక్షలో మంత్రి పొన్నం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదాల్లో ప్రతి రోజూ రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌, హెల్మెట్‌, సీటు బెల్ట్‌ ధరించకపోవడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. రోడ్డు భద్రతా విభాగంతోపాటు పోలీస్‌, ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసినప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు జిల్లాల్లో అవగాహన సదస్సులు, వర్క్‌షా్‌పలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పాఠశాల, కాలేజీలు, గురుకులాలు, వృత్తి శిక్షణ సంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు.. బీసీ సంక్షేమ శాఖలో అమలవుతున్న వివిధ పథకాలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు నిర్దుష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. కాగా ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం కేక్‌ కట్‌ చేసి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 05 , 2025 | 03:38 AM