Raghunandan Rao: బీసీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి
ABN, Publish Date - Mar 08 , 2025 | 04:52 AM
బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదని, దమ్ముంటే బీసీలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సవాల్ విసిరారు.
ఎమ్మెల్సీ కవితకు మెదక్ ఎంపీ రఘునందన్ సవాల్
గజ్వేల్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదని, దమ్ముంటే బీసీలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సవాల్ విసిరారు. లేదంటే కేసీఆర్‌తో మాట్లాడి శాసనసభ ప్రతిపక్ష నాయకుడి హోదాను బీసీకి ఇప్పించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో బీసీ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసి, బయటకు పంపించిన చరిత్ర బీఆర్‌ఎ్‌సది అని విమర్శించారు. మొదటి దఫా కేసీఆర్ క్యాబినెట్‌లో ఒక్క మహిళకూ మంత్రి పదవినీ ఇవ్వలేదని గుర్తు చేశారు.
Updated Date - Mar 08 , 2025 | 04:52 AM