ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాంకేతిక కారణాలతో ఆర్టీసీ కొలువుల భర్తీలో జాప్యం: సజ్జనర్‌

ABN, Publish Date - May 28 , 2025 | 07:42 AM

ఆర్టీసీ 3036 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం ఇచ్చినా సాంకేతిక కారణాలతో నియామకాల్లో జాప్యం జరుగుతోంది. ఎండీ సజ్జనార్ ఈ నియామకాలు త్వరలో జరిగాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆర్టీసీలో 3036 పోస్టుల భర్తీకి సర్కారు అనుమతినిచ్చింది. అయితే.. సాంకేతిక కారణాలతో రిక్రూట్‌మెంట్‌లో జాప్యం నెలకొంటోంది. నియామకాలు కచ్చితంగా జరుగుతాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు’’ అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో రాష్ట్రస్థాయి ఉద్యోగుల సంక్షేమ మండలి(ఈడబ్ల్యూబీ) సభ్యులతో యాజమాన్యం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సజ్జనార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి వెల్పేర్‌ బోర్డు సభ్యుల సూచనలు, సలహాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగా.. తమ మనుగడ కోసం రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతున్నారని.. ఉద్యోగులు ఈ విషయాన్ని గ్రహించి, ఎంతో ఓపికగా ఉన్నారని చెప్పారు.

Updated Date - May 28 , 2025 | 07:43 AM