ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Komatireddy Venkata Reddy: బీజేపీ ఎదగడానికి బీఆర్‌ఎస్సే కారణం

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:32 AM

తెలంగాణలో బీజేపీ ఎదగడానికి కారణం బీఆర్‌ఎస్‌ పార్టీనేని.. ముమ్మాటికీ ఆ ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

  • మళ్లీ మేం దేశ వ్యాప్తంగా గెలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ ఎదగడానికి కారణం బీఆర్‌ఎస్‌ పార్టీనేని.. ముమ్మాటికీ ఆ ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు అందించినందుకు అభినందనలు అంటూ బీఆర్‌ఎ్‌సకు చురకలు అంటించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ కాంగ్రెస్‌ ఓట మి పాలవ్వడంపై రాహుల్‌గాంధీపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి తిప్పికొట్టారు.


ఈ సందర్భంగా.. ‘‘మేం కాంగ్రెస్‌ పార్టీ యోధులం. తెలంగాణలో ఓటమి తరువాత ఎలాగైతే తిరిగి పుంజుకుని విజయం సాధించామో.. అలాగే దేశ వ్యాప్తంగా గెలుస్తాం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం మీ సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం మీది, మీ పార్టీది.’’ అంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

Updated Date - Feb 09 , 2025 | 04:33 AM