మా భూములు ఇవ్వం
ABN, Publish Date - Jan 29 , 2025 | 11:34 PM
ఎన్‌టీపీసీ యాజమాన్యం మా బతుకుల్లో మట్టి కొట్టిందని, మా భూములను బలవం తంగా గుంజుకుందని మొగల్‌పహాడ్ రైతులు చిలుక ప్రసాద్, చిలుక రాజేషం ఆరోపించారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1982లో ఎన్‌టీపీసీ యాష్ పాండ్ నిర్మాణానికి 660 ఎకరాల భూములను ఎన్‌టీపీసీ యాజమా న్యం లాక్కుందన్నారు.
కళ్యాణ్‌నగర్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ఎన్‌టీపీసీ యాజమాన్యం మా బతుకుల్లో మట్టి కొట్టిందని, మా భూములను బలవం తంగా గుంజుకుందని మొగల్‌పహాడ్ రైతులు చిలుక ప్రసాద్, చిలుక రాజేషం ఆరోపించారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1982లో ఎన్‌టీపీసీ యాష్ పాండ్ నిర్మాణానికి 660 ఎకరాల భూములను ఎన్‌టీపీసీ యాజమా న్యం లాక్కుందన్నారు. భూములు తీసుకున్న ప్పుడు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, లాంగ్ లిస్టు ఇచ్చారని, కానీ కేవలం నలుగురికి మాత్రమే ఉద్యోగం కల్పించారని చెప్పారు. భూముల పరిహారంపై ఎన్‌టీపీసీ యాజమా న్యం కోర్టుకు వెళ్లిందని, ఇప్పటివరకు డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొగల్ పహాడ్‌లో మిగిలి ఉన్న 556ఎకరాల భూమిని సర్వే చేసేందుకు వస్తే అడ్డుకున్నామని, మూడుతరాలు అయినా మాకు న్యాయం జర గడం లేదన్నారు. మొగల్ పహాడ్ గ్రామస్థులు ప్రజాభిప్రాయ సేకరణకు వస్తారని అరెస్టు చేసి చెన్నూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించా రన్నారు. ఎన్‌టీపీసీ యాజమాన్యం ప్రజాభి ప్రాయ సేకరణ ఎందుకు పెట్టిందని, ప్రజలు సమస్యలు చెప్పుకోవడా నికి వస్తే వారిని అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. శుక్ర వారం గ్రామంలో మళ్లీ ప్రజా భిప్రాయ సేకరణ చేపడుతున్నా రన్నారు. రైతులకు అధికారులు ఏం న్యాయం చేస్తారో చెప్పాలని, తాము 40 ఏళ్లుగా అన్యాయానికి గురయ్యా మన్నారు. నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, లింగయ్య, దుర్గయ్య, సరోజన, ప్రసాద్, నర్సయ్య, రాములు, హనుమంతు, సతీష్ పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2025 | 11:34 PM