ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సామాన్యుడికి న్యాయం జరిగేలా కృషి

ABN, Publish Date - Mar 10 , 2025 | 11:59 PM

చట్ట పరిధిలో పోలీసుల ను ఆశ్రయించే సామాన్యుడికి న్యాయం జరిగేలా చూస్తామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే బాధి తులు నేరుగా కలువాలని రామ గుండం పోలీస్‌ కమిషనర్‌ అం బర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమవారం రామగుండం కమి షనరేట్‌లో కమిషనర్‌గా బాధ్య తలు స్వీకరించారు. సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

కోల్‌సిటీ, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): చట్ట పరిధిలో పోలీసుల ను ఆశ్రయించే సామాన్యుడికి న్యాయం జరిగేలా చూస్తామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే బాధి తులు నేరుగా కలువాలని రామ గుండం పోలీస్‌ కమిషనర్‌ అం బర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. సోమవారం రామగుండం కమి షనరేట్‌లో కమిషనర్‌గా బాధ్య తలు స్వీకరించారు. సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లా డుతూ కమిషరేట్‌ పరిధిలో శాం తిభద్రతల పరిరక్షణ 24గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామ న్నారు. సత్పవర్తన, మంచి నడవడిక కలిగిన వారికి, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేస్తామని, అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యక లాపాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నూతన టెక్నాలజీతో నేరా ల నియంత్రణకు కృషి చేయనున్నట్టు సీపీ తెలిపారు. ల్యాండ్‌ మాఫి యా, డ్రగ్స్‌, గంజాయి రవాణా పట్ల ఉక్కు పాదం మోపుతామన్నారు.

2009 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి...

అంబర్‌ కిశోర్‌ ఝా 2009 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 2011లో ఉమ్మ డి ఆదిలాబాద్‌ జిల్లా ఏఎస్‌పీగా పని చేసిన 2012లో వరంగల్‌ ఓఎస్‌ డీగా, అదనపు ఎస్‌పీగా పని చేశారు. 2014లో వరంగల్‌ రూరల్‌ ఎస్‌పీగా పని చేసిన ఆయన రాష్ట్ర ఏర్పాటు తరువాత భద్రాద్రి కొత్త గూడెం ఎస్‌పీగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో హైదరాబాద్‌ సౌత్‌ జోన్‌ డీసీపీగా పని చేసి అదే సంవత్సరం కేంద్ర సర్వీసులో విధు లు నిర్వహించారు. గత సంవత్సరం డీఐజీగా పదోన్నతి పొంది రాచ కొండ జాయింట్‌ సీపీగా పని చేశారు. అనంతరం వరంగల్‌ సీపీగా పని చేసి ప్రస్తుతం రామగుండం కమిషనర్‌గా నియమితులయ్యారు. సీపీకి అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, డీసీపీ భాస్కర్‌, పెద్దపల్లి డీసీపీలు కరుణాకర్‌, ఏసీపీలు, ఆర్‌ఐలు స్వాగతం పలికారు.

Updated Date - Mar 10 , 2025 | 11:59 PM