ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక రవాణా నిలిపివేస్తామని నిరంతర సరఫరాకు అనుమతి

ABN, Publish Date - Feb 16 , 2025 | 12:25 AM

మంథని నియోజకవర్గంలో ఇసుక లారీలు బంద్‌ చేయిస్తానన్న ఎమ్మెల్యే మాట ఏమైందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రశ్నించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం 24 గంటల ఇసుక పాలసీని తీసుకురావడం దారుణమన్నారు. దీనికి ఎమ్మెల్యే మద్దతు ఉందన్నారు.

మంథని, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మంథని నియోజకవర్గంలో ఇసుక లారీలు బంద్‌ చేయిస్తానన్న ఎమ్మెల్యే మాట ఏమైందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రశ్నించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం 24 గంటల ఇసుక పాలసీని తీసుకురావడం దారుణమన్నారు. దీనికి ఎమ్మెల్యే మద్దతు ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకులు ఒకే విధంగా ఉంటూ ప్రజలను మోసం చేస్తుంటా రన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు రోజుల్లో ఇసుకల లారీలు బంద్‌ చేయిస్తామని మాట ఇచ్చి ఎమ్మెల్యే నేడు ఇసుక తరలింపుపై ఎందుకు స్పందించడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక రవాణాకు అనుమతులు ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం 24 గంటలు ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వడాన్ని ప్రజలు గమనించాల న్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల నుంచి ఇసుక లారీలు వెళ్ళకుండా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకున్నారన్నారు. మంథని ఎమ్మెల్యే ఎందుకు ఆలోచించడం లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. తగరం శంకర్‌ లాల్‌, మాచీడి రాజుగౌడ్‌, ఏగోళపు శంకర్‌గౌడ్‌, కాయితీ సమ్మయ్య, బెల్లంకొండ ప్రకాష్‌రెడ్డి, పుప్పాల తిరుపతి, కాయితీ సమ్మయ్య, పెగడ శ్రీను, వేల్పుల గట్టయ్య, ఓదెలు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 12:25 AM