ఎల్‌ఆర్‌ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయవద్దు
ABN, Publish Date - Mar 10 , 2025 | 11:57 PM
ఎల్‌ఆర్‌ఎస్ కాకుండా అక్ర మ లేఅవుట్‌లలోని ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎల్‌ఆర్ ఎస్‌పై అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి అధికారులతో రివ్యూ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ లేఅవుట్ క్రమబద్ధీకరణ 2020 పథ కం కోసం దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి ఫీజుతోపాటు ఓపెన్ స్పెస్‌చార్జిలను మార్చి 31లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంద న్నారు.
పెద్దపల్లిటౌన్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) ఎల్‌ఆర్‌ఎస్ కాకుండా అక్ర మ లేఅవుట్‌లలోని ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎల్‌ఆర్ ఎస్‌పై అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి అధికారులతో రివ్యూ నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ లేఅవుట్ క్రమబద్ధీకరణ 2020 పథ కం కోసం దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి ఫీజుతోపాటు ఓపెన్ స్పెస్‌చార్జిలను మార్చి 31లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుంద న్నారు. ఆగస్టు 26, 2020 వరకు 10 శాతం ప్లాట్లు విక్రయించిన లేఅవు ట్‌లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, సబ్ రిజిస్టర్ ద్వారా 10 శాతం ప్లాట్లు విక్రయించిన లేఅవుట్‌లు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు సమర్పించవచ్చన్నారు. క్రమబద్ధీకరణ చేయని ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిషేధిత జాబితాలో లేని, బఫర్, ఎఫ్‌టిఎల్, చెరువులు కుంటలు తది తర ప్రాంతాలలో లేని ప్లాట్లకు ఆటోమేటిక్‌గా ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి లభిస్తుందని చెప్పారు. చెరువులు నీటి వనరులు తదితర ప్రాంతాలకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అనుమతులు చూడాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి స్థల క్రమబద్ధీకరణ చేసి సంబంధిత ప్రొసీడింగ్స్ జారీ చేయాలన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారులు గంగయ్య, సురేష్, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్, తహసీల్దార్లు, అధికారులు, పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించిన 24 గంటల్లో క్రమబద్ధీకరణ
ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించిన వారికి 24 గంటల్లో క్రమబద్దీకరణ పత్రాలు జారీ చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మున్సిపల్ కార్యాల యంలో రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. గడువులోగా ఎల్‌ఆర్‌ఎస్ రుసుం చెల్లించి ప్రభుత్వం అందించే 25 శాతం రాయితీ పొందేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. జిల్లా పరిధిలో 16 వేల స్థలాల క్రమ బద్ధీకరణకు సంబంధిత ఓనర్లకు ఫీజు వివరాలు తెలియజేశామని, ఇప్పటి వరకు 400 మంది మాత్రమే స్పందించారని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పై సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో హెల్ఫ్‌డెస్క్‌లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరు గుతుందని కలెక్టర్ తెలిపారు. కమిషనర్ వెంకటేష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్, అధికారులు, పాల్గొన్నారు.
Updated Date - Mar 10 , 2025 | 11:57 PM