ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి

ABN, Publish Date - Mar 04 , 2025 | 12:46 AM

అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్డ్‌ కార్మికులకు 7వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎన్టీపీసీ లేబర్‌ గేటు వద్ద సీఐ టీయూ అనుబంధ రామగుం డం ఇండస్ట్రియల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భూపాల్‌ ప్రసంగించారు.

జ్యోతినగర్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్డ్‌ కార్మికులకు 7వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎన్టీపీసీ లేబర్‌ గేటు వద్ద సీఐ టీయూ అనుబంధ రామగుం డం ఇండస్ట్రియల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భూపాల్‌ ప్రసంగించారు. కార్మికుల కనీస వేతనాలకు సంబంధించి 2006, 2012 మధ్య కాలంలో వేతన సవరణలు చేశా రన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2021లో కొన్ని షేడ్యూళ్లకు వేతన సవరణ చేసి జీవోలు విడుదల చేశారన్నారు. అయితే ఆ జీవోలు అమలుకు నోచుకోలేదన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కార్మికుల వేతనాలను సవరించడం లేదని భూపాల్‌ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఐఎన్‌టియుసి నాయకుడు జనక్‌ ప్రసాద్‌కు కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌గా నియమించారని, కార్మికుల పక్షాన పోరాడే సీఐటీయూకు, మిగతా కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించ లేద న్నారు. ఈనెల 6న కలెక్టరేట్ల వద్ద ధర్నా, 7న హైదరాబాద్‌లోని లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదుర్శులు కుమారస్వామి, ముత్యంరావు, నాయకులు ఎన్‌భిక్షపతి, నాంసాని శంకర్‌, గీట్ల లక్ష్మారెడ్డి, రాఘవరెడ్డి, మల్లేశ్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2025 | 12:46 AM