సీతారామపై కాళేశ్వరం ఎఫెక్ట్
ABN, Publish Date - Feb 12 , 2025 | 05:14 AM
కాళేశ్వరం బ్యారేజీల ప్రభావం సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుపై పడింది. మేడిగడ్డ కుంగిపోవడానికి డిజైన్లు, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, డిజైన్‌కు తగ్గట్లుగా నిర్మాణం జరుగకపోవడం కారణమని జాతీయ
బ్యారేజీల డిజైన్ల పునఃపరిశీలనకు.. నిర్ణయించిన టీఏసీ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల ప్రభావం సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుపై పడింది. మేడిగడ్డ కుంగిపోవడానికి డిజైన్లు, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, డిజైన్‌కు తగ్గట్లుగా నిర్మాణం జరుగకపోవడం కారణమని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) ప్రాథమిక విచారణలో నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే..! తాజాగా సీతారామ ప్రాజెక్టుకు చెందిన డిజైన్లను పునఃపరిశీలించాలని కేంద్ర జలవనరులు/నది అభివృద్ధి/గంగా పునరుజ్జీవన పథక విభాగానికి చెందిన సలహా మండలి 157వ సమావేశం నిర్ణయం తీసుకుంది.
మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో డిజైన్ల విషయంలో సీడబ్ల్యూసీతో పునఃపరిశీలన చేయించేలా సిఫారసుకు నిర్ణయించారు. నెలరోజుల తర్వాత మళ్లీ టీఏసీ భేటీ జరుగనుంది. కాగా.. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ ఆంధ్రప్రదేశ్ చాలా రోజులుగా కోరుతున్న విషయం విదితమే. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరిపై ఒప్పందం కుదిరేదాకా లేదా ట్రైబ్యునల్ నీటి పంపకాలను తేల్చేదాకా సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బాహుళార్థ సాధక ప్రాజెక్టు డీపీఆర్‌ను తదుపరి క్లియరెన్స్‌ల కోసం కేంద్ర జలవనరుల సంఘానికి పంపించరాదని గోదావరి బోర్డును కోరుతూ గతంలో ఏపీ లేఖ రాసింది.
Updated Date - Feb 12 , 2025 | 05:15 AM