ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

ABN, Publish Date - Feb 22 , 2025 | 04:21 AM

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనాచార్యులు ఆధ్వర్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల కోసం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

  • ప్రైవేట్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ టీచర్ల సవాల్‌

  • పెద్దపల్లి జిల్లా రచ్చపల్లిలో ముందస్తు బడిబాట కార్యక్రమం

ధర్మారం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీ మోహనాచార్యులు ఆధ్వర్యంలో వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల కోసం ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఓపెన్‌ చాలెంజ్‌ పేరిట కరపత్రాలను అందజేశారు. తమ పాఠశాల విద్యార్థులతో ప్రైవేట్‌ స్కూల్‌ పిల్లలు తెలుగు, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌లో పోటీ పడాలని పిలుపునిచ్చారు. తమ విద్యార్థుల కంటే బాగా చదివితే రూ.500 నగదు బహుమానం ఇస్తామన్నారు. లేదంటే వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.

Updated Date - Feb 22 , 2025 | 04:21 AM