ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: ‘గుట్ట’ పరికి చెరువులో ఆక్రమణల తొలగింపు

ABN, Publish Date - Feb 21 , 2025 | 05:13 AM

రోడ్లు, పార్లుల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా చెరువులపైనా దృష్టి సారించింది. గురువారం కుత్బుల్లాపుర్‌ మండలం జగద్గిరిగుట్టలోని పరికి చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని నిర్మాణాలను తొలగించింది.

  • నిర్మాణాలు, బేస్‌మెంట్లను కూల్చిన హైడ్రా

  • చెరువు పరిరక్షణ సమితి ఫిర్యాదుతో చర్యలు

హైదరాబాద్‌ సిటీ/జీడిమెట్ల, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, పార్లుల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా చెరువులపైనా దృష్టి సారించింది. గురువారం కుత్బుల్లాపుర్‌ మండలం జగద్గిరిగుట్టలోని పరికి చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని నిర్మాణాలను తొలగించింది. స్థానిక రాజకీయ నేత బాలకృష్ణ.. ప్రభుత్వ భూమితోపాటు, చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని స్థలాలను ప్లాట్లుగా చేసి నోటరీపై విక్రయిస్తున్నాడని పరికి చెరువు పరిరక్షణ సమితి ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 60 ఎకరాల చెరువు ఇప్పటికే చాలా వరకు కబ్జాకు గురైందని, పాఠశాల మైదానం పేరుతో 1000 చదరపు గజాలకుపైగా స్థలాన్ని బాలకృష్ణ ఆక్రమించారని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ దృష్టికి తెచ్చారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు పలు నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చాయి. పరికి చెరువు పక్కనే ఉన్న భూదేవి, షిరిడీ హిల్స్‌ వైపు నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయని తేల్చారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రజలు నివాసముంటున్న ఇళ్ల జోలికి వెళ్లకుండా.. ఇతర నిర్మాణాలను తొలగించారు. ప్రొక్లెయినర్‌ డ్రైవర్‌ రవికి చెందిన బేస్‌మెంట్‌ను హైడ్రా తొలగించడంతో భార్య, కుమారుడితో కలిసి అక్కడకు వచ్చిన రవి కూల్చివేత యంత్రాలకు అడ్డుగా పడుకొని విలపించాడు. ’కాయకష్టం చేసి.. కడుపు కట్టుకొని కూడబెట్టిన డబ్బుతో పాటు, కొంత అప్పు చేసి ఏడాది కిందటే రూ.15 లక్షలకు 50 గజాల స్థలం కొన్నా. నాకు న్యాయం చేయకుంటే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అధికారులు, పోలీసులు రవికి నచ్చచెప్పడంతో శాంతించాడు.


హైడ్రా విధుల్లో డీఆర్‌ఎఫ్‌ పాత్ర కీలకం: రంగనాథ్‌

హైడ్రా నిర్వహిస్తున్న విధుల్లో విపత్తు స్పందన బృందాల (డీఆర్‌ఎఫ్‌) పాత్ర కీలకమని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. డీఆర్‌ఎ్‌ఫలోకి అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నూతనంగా తీసుకున్న 357 మందికి శిక్షణ కార్యక్రమాన్ని రంగనాథ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలతోపాటు.. ఆస్తి నష్టం తగ్గించేందుకు డీఆర్‌ఎఫ్‌ కృషి చేస్తుందని, ఇప్పుడు అదనంగా హైడ్రా విధులూ తోడయ్యాయన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 05:13 AM