ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget-2025: బడ్జెట్-2025.. వైరల్‌గా మారిన జీరో బడ్జెట్ ఫ్లెక్సీలు..

ABN, Publish Date - Feb 02 , 2025 | 08:27 AM

హైదరాబాద్ నగరంలో తాజాగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన జీరో బడ్జెట్ ఫెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కి 8 మంది ఎంపీలు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారని, అయినా నిధులు తేవడంలో పూర్తిగా విఫలం అయ్యారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Zero budget flexi

హైదరాబాద్: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2025(Budget-2025)పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ సర్కార్ (PM Modi Govt) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ రెండు పార్టీలూ పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారంటూ కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ పార్టీల నేతలు మండిపడుతున్నారు.


ఫ్లెక్సీలు వైరల్..

హైదరాబాద్ నగరంలో తాజాగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన జీరో బడ్జెట్ ఫెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కి 8 మంది ఎంపీలు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారని, అయినా నిధులు తేవడంలో పూర్తిగా విఫలం అయ్యారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈసారి ప్రవేశపెట్టింది దేశ గతిని మార్చే బడ్జెట్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ భాగస్వామి అంటూ మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు మండిపడుతున్నారు. ఇంత మంది ఉండి కూడా రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జీరో బడ్జెట్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


నిరసనకు పిలుపు..

మరోవైపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న(శనివారం) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ సైతం ఆగ్రహించింది. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించింది గుండు సున్నా అంటూ హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు ఆదివారం, సోమవారాల్లో పెద్దఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. కేటాయింపుల్లో తెలంగాణపై వివక్ష చూపారంటూ ఇవాళ (ఆదివారం) ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద భారీ ధర్నా చేయనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. అలాగే సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలోనూ స్థానిక అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొనాలని సూచించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Budget : మేడమ్ సర్‌ప్రైజ్‌

ఉచితాల ఊబిలో ‘రుణ భారతం’!

Updated Date - Feb 02 , 2025 | 08:35 AM