Road Accident: వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ
ABN, Publish Date - Jan 30 , 2025 | 10:02 AM
తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లా, వేములవాడలో లారీ బీభత్సం సృష్టించింది. అలాగే ఏపీలోని విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, బోడసింగి పేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన లారీ కారు, బైక్‌కు ఢీ కొట్టింది.
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ (Vemulawada)లో లారీ (Lorry) బీభత్సం సృష్టించింది (Road Accident). మొదటి బైపాస్ రహదారి మహాలక్ష్మి వీధిలోని విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అటునుంచి మూలవాగు వంతెనపై డివైడర్లను లారీ ఢీకొట్టి.. తిప్పాపూర్‌లోని కదిరే రాజమల్లయ్య దుకాణంలోకి దూసుకు వచ్చింది. ఈ ఘటనలో రాజ మల్లయ్య ద్విచక్ర వాహన కన్సల్టెన్సీలోని ఐదు వాహనాలు ధ్వంస మయ్యాయి. డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని కాలనీవాసుల వెల్లడించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ వార్త కూడా చదవంటి..
జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
అదుపు తప్పి కారు, బైక్‌కు ఢీ కొట్టిన లారీ..
మరోవైపు ఏపీలోని విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, బోడసింగి పేట గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న కారుతో పాటు మోటార్ సైకిల్‌ను ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. గజపతినగరం నుంచి విజయనగరం వెళ్తున్న లారీ వేగంగా వస్తూ అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అలాగే కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా బలంగా లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో మోటార్ సైకిల్ పూర్తిగా నుజ్జయింది. ద్విచక్ర వాహనంపై వస్తున్న సీతానగరం మండలం, భద్రంవలస గ్రామానికి చెందిన బలజాన ముకుందకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాలు విరిగింది. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అలాగే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరంలోని మహరాజా కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముకుందకు పెళ్లి నిశ్చయమైంది. మరో పది రోజుల్లో వివాహం కావాల్సి ఉంది. ఈ సందర్భంగా అతను శుభలేఖలు పంచడానికి వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాఘమాసం వచ్చేసింది... శుభ ఘడియలు.. పెళ్లి సందడి..
ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 30 , 2025 | 10:02 AM