TG Govt: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
ABN, Publish Date - Mar 04 , 2025 | 04:05 PM
TG Govt: తెలంగాణలోని మహిళలకు మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తూ.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం అందిస్తుంది. దీంతో ఈ పథకం విజయవంతమైంది. అలాంటి వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన జీవోను సైతం మంగళవారం ప్రభుత్వం జారీ చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 04: అంతర్జాతీయ మహిళ దినోత్సవం మరికొద్ది రోజుల్లో రానుంది. అలాంటి వేళ తెలంగాణ మహిళ సమాఖ్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం అందుకు సంబంధించిన జీవోను రేవంత్ సర్కార్ జారీ చేసింది. తొలి విడతలో 150 మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె కింద రూ. 77,220 చెల్లించనుంది.
ఇక బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ సైతం ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను నడపనున్నాయి. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ రోజు సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్ మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్ని.. ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నారు.
మరోవైపు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరిట మహాలక్ష్మీ పథకాన్ని చేపట్టారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తు్న్నారు. అయితే ఈ పథకం వల్ల రాష్ట్రంలోని మహిళలు.. ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక అంతకుముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అక్కడ సైతం ఆ పార్టీ అధికారంలోకి రావడంతో.. తెలంగాణలో సైతం తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఈ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో తెలంగాణ ఓటరు సైతం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని అమలు చేస్తోంది. దీంతో మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడం.. తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్ అనే అభిప్రాయం సర్వత్ర వినిపిస్తోంది.
For Telangana News And Telugu News
Updated Date - Mar 04 , 2025 | 04:53 PM