Republic Day: రాజ్యాంగాన్ని పక్కాగా పాటించాలి..: జస్టిస్ అనీల్ కుమార్
ABN, Publish Date - Jan 27 , 2025 | 01:28 PM
రాజ్యాంగాన్ని పక్కాగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జస్టిస్ అనీల్ కుమార్ తెలిపారు. రాజ్యాంగంలోని విలువల కోసం లాయర్లు కృషి చేయాలన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించడంలో న్యాయవాదుల సహాయ సహకారాలు ఎంతో అవసరం అని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 26: స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుని.. వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని DRAT కోల్‌కతా చైర్‌పర్సన్, జస్టిస్ అనీల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. 76 గణతంత్ర వేడుకల సందర్భంగా హైదరాబాద్ DRT ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాజ్యాంగాన్ని పక్కాగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జస్టిస్ అనీల్ కుమార్ తెలిపారు. రాజ్యాంగంలోని విలువల కోసం లాయర్లు కృషి చేయాలన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించడంలో న్యాయవాదుల సహాయ సహకారాలు ఎంతో అవసరం అని తెలిపారు. యువ లాయర్లు సీనియర్ న్యాయవాదులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అనంతరం DRT1, DRT2 ప్రిసైడింగ్ అధికారులు, గుమ్మడి గోపీచంద్, రామేశ్వర్ గంగారామ్ కోఠే, అసోసియేషన్ ప్రెసిడెంట్ జికె దేశ్‌పాండే, జనరల్ సెక్రటరీ డి. రాఘవులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో DRT అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు పతకాలను అందజేశారు. అనంతరం పలువురు సీనియర్ న్యాయవాలను DRAT కోల్‌కతా చైర్‌పర్సన్, జస్టిస్ అనీల్ కుమార్ శ్రీవాస్తవ, DRT1, DRT2 ప్రిసైడింగ్ అధికారులు, అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఘనంగా సత్కరించారు. తెలంగాణ ఎన్‌సిసి నేవల్ యునిట్ కేడిట్స్ నిర్వహించిన పెరేడ్ పలువురిని ఆకట్టుకుంది.
Updated Date - Jan 27 , 2025 | 01:28 PM