ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు.. విచారణ చేస్తున్న పోలీసులు..

ABN, Publish Date - Feb 02 , 2025 | 09:16 AM

హైదరాబాద్ మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడ దొరికిన వేలిముద్రలు, సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌గా గుర్తించారు.

హైదరాబాద్: గచ్చిబౌలి ప్రిజమ్ పబ్‌లో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులపై కాల్పులకు తెగబడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ(ఆదివారం) విచారణ చేస్తున్నారు. నిందితుడు ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారుతోంది.


అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడ దొరికిన వేలిముద్రలు, సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్‌గా గుర్తించారు. అతనిపై 80 కేసులు ఉన్నాయని, 2023 నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు తేల్చారు. తెలివిగా దొంగతనాలు చేయడంతో ప్రభాకర్ దిట్ట. ముఖానికి మాస్క్ ధరిస్తూ.. ఏ చిన్న క్లూ లేకుండా చోరీలకు పాల్పడుతుంటాడు. అలా సంపాదించిన నగదుతో జల్సాలు చేస్తుంటాడు. అయితే పోలీసులు ఎట్టకేలకు అతని ఆచూకీ కనిపెట్టారు. ప్రిజమ్‌ పబ్‌కు తరచూ వస్తుంటాడని మాదాపూర్‌ సీసీఎస్‌ పోలీసులకు సమాచారం అందింది. ఈసారి పక్కా పథకం ప్రకారం అతని అరెస్టు చేయాలని ప్లాన్ చేశారు.


మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ శనివారం రాత్రి ప్రిజమ్ పబ్బుకు వచ్చినట్లు సమాచారం అందుకున్న మాదాపూర్‌ సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్రామిరెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ ప్రాంతానికి వెళ్లారు. వీరిని చూసి తప్పించుకునే క్రమంలో నిందితుడు పబ్‌లోకి వెళ్లాడు. పోలీసులు సైతం లోపలికి వెళ్లగా వారిపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాడిలో కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి ఎడమ తొడలోకి ఓ తూటా దూసుకెళ్లింది. మరో ఇద్దరు పబ్‌ బౌన్సర్లకు సైతం గాయాలు అయ్యాయి. అయితే అతి కష్టం మీద అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రభాకర్ వద్ద నుంచి రెండు తుపాకులు, 23 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గాయాలైన వెంకట్రామిరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. కాగా, నేడు అతన్ని విచారణ చేస్తున్నారు.

Updated Date - Feb 02 , 2025 | 09:16 AM