TG News: ప్రేమించిన పాపానికి ఆ యువకుడి తండ్రిని దారుణంగా..
ABN, Publish Date - Jan 15 , 2025 | 02:53 PM
Telangana: అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రకాష్ (60) అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ అఘాయిత్యానికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. అల్వాల్‌లో నివాసముండే ప్రకాష్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 15: ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలను చూస్తుంటాం. ప్రేమించలేదని యువతలపై దాడులు, చంపడాలు ఇలా ఎన్నో ఘటనలు వెలుగుచూశాయి. అలాగే అమ్మాయి ప్రేమ విషయం తెలిసిన కొందరు తల్లిదండ్రులు కూడా పెట్రేగిపోతుంటారు. ప్రియుడి ఇంటిపై దాడులకు పాల్పడుతుంటారు. ఏకంగా ఆ అబ్బాయిని చంపడానికి కూడా వెనకాడరు కొందరు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. తమ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని హత్య చేయాలని భావించారు. అనుకున్న ప్రకారం యువకుడి ఇంటికి వెళ్లారు. అయితే యువకుడు లేకపోవడంతో అమ్మాయి తరపు వాళ్లు చేసిన పని ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. యువకుడి తండ్రిపై వారు చేసిన అఘాయిత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నగరంలోని అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రకాష్ (60) అనే వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ అఘాయిత్యానికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. అల్వాల్‌లో నివాసముండే ప్రకాష్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రకాష్ కొడుకు ప్రదీప్ ఓ అమ్మాయి ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తరపు వాళ్ల ప్రదీప్‌పై దాడి చేయాలని నిర్ణయించారు. ప్రదీప్ ఇంటికి వచ్చారు నందకుమార్, లక్ష్మీ. అయితే వాళ్లు వెళ్లిన సమయానికి ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో తండ్రి ప్రకాష్‌పై దాడి చేశారు. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. మంటల ధాటికి ప్రకాష్ కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు అక్కడకు వచ్చి మంటలను అదుపు చేశారు.
మంత్రి లోకేష్‌తో మనోజ్ భేటీ... కారణమిదేనా
అయితే అప్పటికే ప్రకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 50 శాతం కాలిన గాయాలతో ప్రకాష్ గాంధీలో చికిత్స పొందుతున్నాడు. ప్రకాష్‌పై పెట్రోల్ పోసి దాడి చేసే క్రమంలో ఓ చిన్నారికి కూడా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే చిన్నారిని కూడా గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పెట్రోల్ దాడిపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల అదుపులో అనుమానితుడు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమిస్తే ఇలాంటి దాడులకు పాల్పడతారా అంటూ మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
తిరుమల దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా..
TG News: జంట హత్యల కేసు.. ట్రయాంగిల్ లవ్.. చివరకు మిగిలింది ఇదే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 15 , 2025 | 02:56 PM