Share News

TG News: జంట హత్యల కేసు.. ట్రయాంగిల్ లవ్.. చివరకు మిగిలింది ఇదే

ABN , Publish Date - Jan 15 , 2025 | 10:57 AM

Telangana: నార్సింగ్ జంట హత్యల కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ చెందిన యువకుడు అంకిత్ సాకేత్, బిందూకు మధ్య కొద్ది కాలంగా పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఈనెల 11న బిందును ఎల్బీనగర్‌ నుంచి నానక్‌రామ్ గూడకు సాకేత్ పిలిపించాడు. అక్కడే తన స్నేహితుడి రూమ్‌లో బిందును ఉంచాడు సాకేత్.

TG News: జంట హత్యల కేసు.. ట్రయాంగిల్ లవ్.. చివరకు మిగిలింది ఇదే
Hyderabad

హైదరాబాద్, జనవరి 15: నార్సింగీ పుప్పాల్‌గూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్యల కేసులో ట్విస్ట్‌ బయటపడింది. ట్రయాంగిల్ లవ్, వివాహేతర సంబంధం కారణంగా ఈ జంట దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. మృతురాలు బిందుకు గతంలో వివాహం జరుగగా.. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త చత్తీస్‌గఢ్‌లో నివాసం ఉండగా.. బిందు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటోంది. అయితే మధ్యప్రదేశ్ చెందిన యువకుడు అంకిత్ సాకేత్, బిందూకు మధ్య కొద్ది కాలంగా పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. వీరి ఇద్దరి మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం నడుస్తోంది.


ఈ క్రమంలో ఈనెల 11న బిందును ఎల్బీనగర్‌ నుంచి నానక్‌రామ్ గూడకు సాకేత్ పిలిపించాడు. అక్కడే తన స్నేహితుడి రూమ్‌లో బిందును ఉంచాడు సాకేత్. ఆ మరుసటి రోజు ఇద్దరు కలసి పుప్పాల్ గూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడే ఆ జంట ఏకాంతంగా గడిపింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్‌కు వెలుగులోకి వచ్చింది. అంకిత్ సాకేత్‌కు తెలియకుండా బిందు మరో యువకుడితో ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలో బిందు, అంకిత్ సాకేత్‌ల‌ను మరో ప్రియుడు రెడ్ హ్యాండెండ్‌గా చూశాడు. బిందు, అంకిత్ సాకేత్‌తో కలసి ఉండడాన్ని సదరు ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో కోపోద్రోక్తుడైన ప్రియుడు.. ఒక్కసారిగా బిందుపై దాడి చేసి... బండరాళ్లతో హత్య చేశాడు.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..


బిందుపై దాడి జరగడాన్ని చూసి భయాందోళనతో పారిపోయేందుకు సాకేత్ యత్నించగా.. అతడిని కూడా ప్రియుడు పట్టుకుని విచారక్షణా రహితంగా దాడి చేశాడు. తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బండరాయితో మోదిన ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో అంకిత్‌పై మిస్సింగ్ కేసు నమోదు అవగా.. బిందుపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. దీంతో అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో హత్యకు గురైంది వీరిద్దరే అని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిని హత్య చేసేందుకు హంతకుడికి మరెవరైనా సహకరించారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హంతకుడి కోసం నార్సింగ్ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

గోదారోళ్లా మజాకా.. అక్కడ మామూలుగా లేదుగా

తిరుమల దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 15 , 2025 | 10:57 AM