ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T.High Court: కేబీఆర్‌ పార్కు రోడ్డు విస్తరణపై కీలక పరిణామం

ABN, Publish Date - Feb 28 , 2025 | 03:10 PM

T.High Court: కేబీఆర్‌ పార్క్ రోడ్డు విస్తరణకు సంబంధించి హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలవగా.. విచారణ చేసింది ధర్మాసనం. ఈ సందర్భంగా పిటిషనర్లు తమ బాధను కోర్టుకు వినిపించింది.

Telangana High Court

హైదరాబాద్, ఫిబ్రవరి 28: నగరంలోని కేబీఆర్‌ పార్కు (KBR Park) రహదారి విస్తరణకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) పిటీషన్ దాఖలైంది. రహదారి విస్తరణ వల్ల 306 ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోతున్నామని రోడ్డు నెం 92లో ఉన్న కాలనీవాసుల పిటీషన్‌ వేశారు. 100 నుంచి 120 ఫీట్ల వరకు విస్తరణ చేపడుతున్నారనట్లు పిటీషనర్లు తెలిపారు. విరంచి ఆస్పత్రి చౌరస్తా నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు విస్తరణ చేయాలని నిర్ణయించారని, రహదారి విస్తరణపై సీఎస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చామని కాలనీవాసులు పిటిషన్‌లో పేర్కొన్నారు.


ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు మార్కింగ్ వేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రహదారికి మరోవైపు ప్రభుత్వ భూమియే ఉందన్నారు. అటువైపే పూర్తిగా విస్తరణ చేపడితే నష్టం తగ్గుతుందని పిటీషనర్లు కోర్టుకు తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టు.. మరోసారి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వాలని పిటీషనర్లను ఆదేశించింది. పిటిషనర్ల వినతిపత్రాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు న్యాయస్థానం ఆదేశిస్తూ.. పిటీషన్లపై విచారణ ముగించింది.

Botsa on Budget: ఏపీ బడ్జెట్‌పై బొత్స హాట్ కామెంట్స్


ఇవి కూడా చదవండి...

Gorantla Madhav: మరిన్ని చిక్కుల్లో గోరంట్ల మాధవ్.. వారి ఫిర్యాదుతో..

Payyavula Keshav: అన్నింటిలో డ్రాప్‌ అవుట్‌లే.. ఆకట్టుకున్న పయ్యావుల బడ్జెట్ ప్రసంగం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 03:16 PM