ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Formula E Case: ఏసీబీ, ఈడీ విచారణకు హాజరైన అరవింద్, బీఎన్‌ఎల్ రెడ్డి..

ABN, Publish Date - Jan 08 , 2025 | 10:45 AM

Telangana: మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించడానికి ముందే అరవింద్ కుమార్‌ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎన్‌ఎల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.

Formula E Race Case

హైదరాబాద్, జనవరి 8: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో (Formula E Car Race Case) ఏసీబీ, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేకకార్యదర్శి అరవింద్ కుమార్ (IAS Arvind Kumar) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించడానికి ముందే అరవింద్ కుమార్‌ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ బీఎన్‌ఎల్ రెడ్డి (HMDA Former Chief BNL Reddy) ఈడీ విచారణకు హాజరయ్యారు. బీఎన్‌ఎల్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. మరోవైపు తన ఏసీబీ విచారణ న్యాయవాదుల సమక్షంలో జరిగేలా చూడాలని కేటీఆర్‌ ఈరోజు హైకోర్టును ఆశ్రయించనున్నారు. దీనిపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నారు. కాగా.. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే కీలకమైన ఆధారాలు బయటపడిన నేపథ్యంలో ఈరోజు జరిగే విచారణకు ప్రధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్.. ఏసీబీ కార్యాలయానికి చేరకోగా కాసేపటి క్రితమే ఏసీబీ విచారణ ప్రారంభమైంది.


అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన తర్వాత ఈ కేసులో కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి బదిలీ చేయడం వెనుక ఉన్న అసలు కోణాలు ఏంటి.. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఈ డబ్బులను రిలీజ్ చేశారా.. అసలేం జరిగింది అనే అంశాలపై అరవింద్ కుమార్‌ నుంచి ఏసీబీ అధికారులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది.

అర్ష్‌దీప్ షాకింగ్ డెలివరీ


నిబంధనలు ఉల్లంఘన...

  • ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌తో ఏకీభవించిన కాంపిటెంట్ అథారిటీ ఆమోదం పొందకుండానే మొత్తం 54 కోట్ల రూపాయలకు పైగా నగదును ఎఫ్‌ఈవో చెల్లింపు ద్వారా ఉల్లంఘనలకు పాల్పడ్డారు.

  • ఫార్ములా ఈ రేసు కేసులో జరిగిన ఒప్పందంలో హెచ్‌ఎండీ భాగస్వామి కానప్పటికీ చెల్లింపులు చేసింది.

  • పార్టీల మధ్య అక్టోబర్ 30, 2023 నాటి ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే చెల్లింపులు జరిగాయి.

  • ఈసీఐ నుంచి ఎటువంటి ఆమోదం తీసుకోకుండా ఎంసీసీ అమలులో ఉన్నప్పుడు కొంత భాగం చెల్లింపు జరిగింది.

  • విదేశీ మారకపు చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే ఉన్న నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపారు.


బీఎల్‌ఎన్‌రెడ్డి విచారణ షురూ..

అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్‌రెడ్డి..ఈడీ ముందుకు విచారణకు హాజరయ్యారు. ఎమ్‌యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు, స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేపట్టారు ఈడీ అధికారు. స్పాన్సరర్‌ చెల్లించాల్సిన డబ్బులను ఎఫ్‌ఈవోకు హెచ్ఎండిఏ చెల్లించడంపై విచారణ జరుపుతున్నారు. ఫార్ములా ఈ రేస్‌తో సంబంధం లేకపోయినా హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి రూ.46 కోట్లు చెల్లించడంపై కూపీలాగుతున్నారు. డాలర్లలో చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడంపై ఈడీ ఫోకస్ పెట్టింది. అడగడుగున నిబంధనల ఉల్లంఘనలపై బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నిస్తోంది.


మరో పిటిషన్...

మరోవైపు రేపు ఉదయం 10 గంటలకు కేటీఆర్‌ కూడా వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ ఏసీబీ ముందు హాజరుకానున్నారు. మరోవైపు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఓ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని, ఏసీబీ అధికారులకు డైరెక్షన్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కేటీఆర్ పిటిషన్‌పై న్యాయస్థానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి...

పేస్ పిచ్చోడి ప్రాక్టీస్ షురూ

కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 08 , 2025 | 11:16 AM