ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Feb 04 , 2025 | 07:25 PM

తెలంగాణలో ఎస్సీల్లో మెుత్తం 59 ఉప కులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారిని మూడు గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

CM Revanth Reddy

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అన్నీ రాష్ట్రాల కంటే ముందే వర్గీకరణను తామే అమలు చేస్తామని మరోసారి సీఎం ప్రకటించారు. వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ తాజాగా రిపోర్టు ఇచ్చిందని ఆయన చెప్పారు. ఆ కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలనే సిఫార్సు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.


తెలంగాణలో ఎస్సీల్లో మెుత్తం 59 ఉప కులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారిని మూడు గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎస్సీలను గ్రూప్ 1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్ సూచించిందని, మెుత్తం 15 శాతం రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రూప్-1లో 15 ఉప కులాలకు ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు. ఆ 15 ఉపకులాల జనాభా 3.288 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. గ్రూప్-2లోని 18 ఉప కులాలకు 9 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్ చెప్పిందని, ఆ 18 ఉప కులాల జనాభా 62.748గా ఉందని సీఎం తెలిపారు. గ్రూప్-3లోని 26 ఉప కులాలకు 5 శాతం రిజర్వేషన్‌ను ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసినట్లు సీఎం చెప్పారు. ఈ 26 ఎస్సీ ఉప కులాల జనాభా 33.963 శాతంగా ఉందని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.." మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పోరాటం జరుగుతోంది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. ఎంతోమంది ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నా రాజకీయ జీవితంలో ఆత్మ సంతృప్తిని కలిగించిన రోజు ఇది. ఇలాంటి అవకాశం నాకు రావడం సంతోషం. చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టింది. అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేసిన అందరికీ అభినందనలు. ఆనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అడ్జర్న్ మోషన్ అందిస్తే నన్ను సభ నుంచి బయటకు పంపించారు. కానీ ఈనాడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నా. ఇది బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైంది. రంగుల గోడలు.. అద్దాల మేడలు కాదు.. చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేడ్కర్ ఆశయానికి అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకు సభ్యులందరితోపాటు ప్రతి ఒక్కరూ సహకారం ఉండాలని కోరుతున్నానని" చెప్పారు.


కాగా, కులగణన సర్వే తప్పుల తడకగా ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని, తమ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం ప్రకటన

Hyderabad: తీన్మార్ మల్లన్నకు షాక్.. డీజీపీకి ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు..

Updated Date - Feb 04 , 2025 | 07:41 PM