ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. అక్కడికి వెళ్లిన కేటీఆర్..

ABN, Publish Date - Jan 07 , 2025 | 06:43 PM

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్రయించారు. బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం కేసును సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది.

BRS Working President KTR

హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు (Formula-E car race case)లో సుప్రీంకోర్టు(Supreme Court)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆశ్రయించారు. మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇవాళ (మంగళవారం) కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం కేసును సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. బుధవారం లేదా గురువారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు.

KTR: ‘నా మాట గుర్తుంచుకో’.. కేటీఆర్ సంచలన ట్వీట్..


ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ చేసిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది, ఇవాళ తాజాగా ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. అంతేకాకుండా అంతకుముందు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ రెండుసార్లు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం న్యాయస్థానం ఎత్తివేసింది. దీంతో కేటీఆర్‌ను ఇవాళ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయిచారు.

Allu Arjun: ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్‌ రియాక్షన్ ఇదే..


మరోవైపు సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తారని ముందుగానే పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆయన కంటే ముందే ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ సర్కార్ కేవియట్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించినప్పటికీ వెంటనే మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Formula E Case: కేటీఆర్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. మరోసారి నోటీసులు

KTR: కేటీఆర్ కేసులో హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు

Updated Date - Jan 07 , 2025 | 07:40 PM