TG News: కిడ్నీ దందా నడుపుతున్న ఆస్పత్రి సీజ్.. యజమాని అరెస్ట్
ABN, Publish Date - Jan 22 , 2025 | 12:58 PM
Telangana: ఎటువంటి అనుమతులు లేకుండానే హాస్పిటల్ యజమాని సుమంత్ ఆరు నెలల నుంచి ఈ కిడ్నీ దందాను నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో సుమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమంత్‌కు సహకరించిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యూరాలజిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 22: నగరంలో కిడ్నీ రాకెట్‌ను (Kidney Racket) నడుపుతున్న అలకనంద ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఆరు నెలల నుంచి కిడ్నీల దందా జరుగుతున్నట్లు అధికారులు తేల్చారు. ఇప్పటికే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగుతున్న సమయంలో ఒక మహిళ మృతి చెందింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా హాస్పిటల్ యాజమాన్యం నొక్కి పెట్టింది. ఎటువంటి అనుమతులు లేకుండానే హాస్పిటల్ యజమాని సుమంత్ ఆరు నెలల నుంచి ఈ కిడ్నీ దందాను నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో సుమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమంత్‌కు సహకరించిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యూరాలజిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి ఎన్ని కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగాయి అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు అలకనంద హాస్పిటల్‌లో కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం (Telangana Govt) సీరియస్‌గా తీసుకుంది. నిజా నిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించింది ప్రభుత్వం. నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్‌లతో కలిపి ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు.. అలకనంద హాస్పటల్‌ను పరిశీలించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అయితే హాస్పిటల్ సీజ్‌లో ఉండటంతో గాంధీ ఆస్పత్రికి కమిటీ సభ్యులు బయలుదేరి వెళ్లారు. ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్, సాధారణ శస్త్ర చికిత్సల నిర్వహణకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ కిడ్నీ మార్పిడి దందాను మొదలుపెట్టారు. ఆస్పత్రి నిర్వాహకుడు సుమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ మార్పిడి చేసి పరారైన వైద్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి...
కాగా.. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నట్లుగా ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక అపరిచిత వ్యక్తి నుంచి వైద్యశాఖ అధికారులకు ఫోన్ కాల్ వెళ్లింది. ఇందులో భాగంగా అలకనంద ఆస్పత్రిలో రహస్యంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతోందని వైద్యశాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే డీఎన్‌హెచ్‌వోతో పాటు పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. అదే సమయం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిన తర్వాత ఇద్దరు పేషంట్లు, వారితో వచ్చిన వారు అక్కడే ఉండటంతో వెంటనే వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి సంబంధించి కిడ్నీలను వేరే వ్యక్తులకు అమర్చినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఆస్పత్రిని సీజ్ చేశారు. ఒక్కొక్కరికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం సుమారు రూ.55 లక్షలు వరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
నిబంధనలు విరుద్ధంగా...
అయితే ఈ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేసేందుకు అనుమతులు లేవు. కేవలం జనరల్ ఫిజిషన్‌తో పాటు, సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకే ఈ ఆస్ప్రతికి అనుమతి ఉంది. అయినప్పటికీ ఎక్కడా కూడా నిబంధనలు పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిని అమాయకులను టార్గెట్‌గా చేసుకుని ఈ దందాకు తెరలేపారు సదరు ఆస్పత్రి నిర్వాహకులు. ఇతర ప్రాంతాల నుంచి కొంత మందిని తీసుకొచ్చి.. వారికి డబ్బు ఆశ చూపించి కిడ్నీల రాకెట్ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక నుంచి మధ్యవర్తుల ద్వారా అలకనంద ఆస్పత్రికి రప్పించి డోనర్లకు కిడ్నీ మార్పిడి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’
Gunfire: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసు.. పోలీసుల పురోగతి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 22 , 2025 | 12:58 PM