ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Population Density: హైదరాబాద్‌ కిటకిట

ABN, Publish Date - Feb 19 , 2025 | 03:57 AM

2011 జనాభా లెక్కల ప్రకారం.. ఢిల్లీ మహానగరంలో ప్రతి చదరపు కిలోమీటరుకూ 11,313 మంది నివసిస్తుండగా, హైదరాబాద్‌ జనసాంద్రత 18,161గా నమోదైంది. అంటే.. భాగ్యనగరంలో ప్రతి చదరపు కిలోమీటరు పరిధిలో పద్దెనిమిది వేల మందికిపైగా నివసిస్తున్నట్టు. ఇవేవో కాకిలెక్కలు కావు..

  • ఢిల్లీ కన్నా భాగ్యనగరంలో అధిక జనసాంద్రత

  • అక్కడ చదరపు కిలోమీటరుకు 11,313 మంది

  • ఇక్కడ 18,161 మంది.. 2031 నాటికి

  • 3.92 కోట్లకు చేరనున్న తెలంగాణ జనాభా

  • వచ్చే పదేళ్లలో భారీగా పెరగనున్న వృద్ధుల సంఖ్య

  • ఏడాది నుంచి ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య 2021తో

  • పోలిస్తే 2036 నాటికి 25ు మేర తగ్గుముఖం

  • 34 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా తగ్గుదల

  • 60ఏళ్లకు పైబడే వారిలో 60 శాతం మేర వృద్ధి

  • 80 ఏళ్లు దాటినవారి సంఖ్యలో 82ు పెరుగుదల

  • తెలంగాణ గణాంకాల సంగ్రహం-2024లో వెల్లడి

(సెంట్రల్‌ డెస్క్‌): రాష్ట్ర రాజధాని కిటకిటలాడిపోతోంది! జనసాంద్రత విషయంలో.. దేశ రాజధాని ఢిల్లీని సైతం మించిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఢిల్లీ మహానగరంలో ప్రతి చదరపు కిలోమీటరుకూ 11,313 మంది నివసిస్తుండగా, హైదరాబాద్‌ జనసాంద్రత 18,161గా నమోదైంది. అంటే.. భాగ్యనగరంలో ప్రతి చదరపు కిలోమీటరు పరిధిలో పద్దెనిమిది వేల మందికిపైగా నివసిస్తున్నట్టు. ఇవేవో కాకిలెక్కలు కావు.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంగ్రహం (అట్లా్‌స)-2024’’లో పేర్కొన్న గణాంకాలు. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న నగరం ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా. అక్కడ ప్రతి చదరపు కిలోమీటరుకూ 43,079 మంది నివసిస్తారు. మనదేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్నది.. ముంబై మహానగరం. అక్కడ ప్రతి చదరపు కిలోమీటరుకూ 28,508 మంది ఉంటున్నారు. ఒకవైపు హైదరాబాద్‌ జనసాంద్రత పెరుగుతుండగా..

బిహార్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాత్రం జనసాంద్రత చాలా తక్కువగా ఉండడం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అంటే సగటున చదరపు కిలోమీటరుకు 312 మంది మాత్రమే నివసిస్తున్నట్టు. ఆ రేటుతో పోలిస్తే.. హైదరాబాద్‌ జనసాంద్రత (18,161) ఎంత అత్యధికంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


కేంద్రీకృత పట్టణీకరణకు ఇది అతిపెద్ద ఉదాహరణ అని సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్‌ మహానగరానికి వలస వస్తుండడంతో.. ఇక్కడ జనసాంద్రత విపరీతంగా పెరిగిపోతోందని, దానివల్ల నగర మౌలికసదుపాయాలపైన, ప్రజా సేవలపైన, గృహ నిర్మాణ రంగం, పట్టణ ప్రణాళికపైన తీవ్రంగా ఒత్తిడి పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. దేశ జనాభాలో తెలంగాణ జనాభా వాటా 2011తో పోలిస్తే 2031 నాటికి 0.23 పర్సంటేజ్‌ పాయింట్ల మేర తగ్గనున్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో అప్పటికి తెలంగాణ వాటా 2.89 శాతం. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల జాబితాలో 12వ స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలో 39.43 లక్షల జనాభాతో హైదరాబాద్‌ జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. కేవలం 2.94 లక్షల జనాభాతో ములుగు జిల్లా చివరిస్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ పాపులేషన్‌ అంచనాల ప్రకారం 2021 నాటికి రాష్ట్ర జనాభా 3.77 కోట్లకు (దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.77ు) చేరింది. 2031 నాటికి అది 3.92 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే దేశ జనాభాలో అప్పటికి తెలంగాణ వాటా 2.66 శాతంగా ఉండనుంది. అంటే.. 2011తో పోలిస్తే 0.23 శాతం తగ్గినట్టు.


వృద్ధులు పెరిగి.. యువజనం తగ్గి..

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో.. 2036 నాటికి రాష్ట్రంలో యువ జనాభా తగ్గి వృద్ధుల జనాభా పెరిగిపోనుందని పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. యువతే మన దేశ సంపద అని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ అంటుంటారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే యువ జనాభాయే కీలకం. అలాంటిది మన తెలంగాణలో 2011తో పోలిస్తే 2036 నాటికి 34 ఏళ్లలోపువారి సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో వృద్ధుల జనాభా పెరగనుంది. జనాభా నియంత్రణ విధానాలను అనుసరించడం వల్ల జననాల రేటు తగ్గిపోవడమే ఇందుకు కారణం. నివేదిక ప్రకారం.. 2011లో మన రాష్ట్రంలో ఏడాది అంతకన్నాతక్కువ వయసున్న చిన్నారులు 5.79 లక్షల మంది. 2036 నాటికి ఆ సంఖ్య 3.94 లక్షలకు తగ్గిపోనుంది. అంటే 25.2 శాతం తగ్గుదల. నాలుగేళ్లలోపు చిన్నారుల సంఖ్య కూడా.. 28.59 లక్షల నుంచి 19.47 లక్షలకు (25.3 శాతం మేర) తగ్గిపోనుంది. 35 నుంచి 39 ఏళ్ల వారి సంఖ్య 4.6 శాతం మేర.. 60-64 ఏళ్లవారి సంఖ్య 69.5 శాతం మేర పెరగనుంది. 80 ఏళ్లు దాటినవారి సంఖ్య అయితే ఏకంగా 82.1 శాతం మేర పెరగనుందని అంచనా. జనాభాలో వచ్చే ఈ మార్పులు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.


ఇవి కూడా చదవండి...

తప్పిన పెను విమాన ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 19 , 2025 | 10:25 AM