గవర్నర్ ప్రతిభా పురస్కారాల ప్రకటన
ABN, Publish Date - Jan 21 , 2025 | 05:00 AM
గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024కు ఎంపికైన వారి జాబితాను గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ప్రకటించారు.
ఈ నెల 26న గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు
హైదరాబాద్,జనవరి 20(ఆంధ్రజ్యోతి): గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024కు ఎంపికైన వారి జాబితాను గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ప్రకటించారు. రాజ్‌భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో వ్యక్తిగతంగా, సంస్థల పరంగా అత్యుత్తమ సేవలు అందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు వివరించారు. అవార్డు కింద రూ.2 లక్షల నగదు, జ్ఞాపికను అందించనున్నట్లు తెలిపారు.
అవార్డులకు ఎంపికైన వారిలో పర్యావరణ విభాగంలో దూషర్ల సత్యనారాయణ, దివ్యాంగుల సంక్షేమ విభాగంలో ఎ.రఘు, క్రీడల విభాగంలో జీవాన్జి దీప్తి, సాంస్కృతిక విభాగంలో పి.బి. కృష్ణభారతి, ఎం.పాండురంగారావు ఉన్నారు. సంస్థల పరంగా ఇచ్చిన అవార్డుల్లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ధుర్‌వాన్ష్ సంస్థ, వికలాంగుల సంక్షేమ విభాగంలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి, క్రీడల్లో ఆదిత్య మెహతా ఫౌండేషన్, సాంస్కృతిక విభాగంలో సంస్కృతి ఫౌండేషన్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు.
Updated Date - Jan 21 , 2025 | 05:00 AM