ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగులను వేధిస్తున్నారు

ABN, Publish Date - Jan 29 , 2025 | 04:47 AM

గోదావరినది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) వ్యవహారం రోడ్డుకెక్కింది. బోర్డు సభ్యకార్యదర్శి(మెంబర్‌ సెక్రటరీ) వ్యవహారశైలిపై ఉద్యోగులు నిరసనగళమెత్తారు. మహిళా ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల పట్ల సభ్యకార్యదర్శి అజగేషన్‌

గోదావరి బోర్డు మెంబర్‌ సెక్రటరీపై సీడబ్ల్యూసీకి తెలంగాణ ఈఎన్‌సీ లేఖ

హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): గోదావరినది యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) వ్యవహారం రోడ్డుకెక్కింది. బోర్డు సభ్యకార్యదర్శి(మెంబర్‌ సెక్రటరీ) వ్యవహారశైలిపై ఉద్యోగులు నిరసనగళమెత్తారు. మహిళా ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల పట్ల సభ్యకార్యదర్శి అజగేషన్‌ అనుచితంగా, అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నారని, పని వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేదని వీరంతా ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుతో పాటు తెలంగాణ ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తమను కాపాడాలని నివేదించుకోగా... ఈ వ్యవహారంపై ఆరా తీసిన అనిల్‌కుమార్‌.. తక్షణ మే అజగేషన్‌ను బదిలీ చేయాలని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఉద్యోగుల పట్ల అనుచితంగా, అవమానపరిచే విధంగా అజగేషన్‌ ప్రవర్తన ఉందని, గోదావరి బోర్డు సభ్యుడిగా ఈ విషయాన్ని నివేదిస్తున్నానని కోరారు. అజగేషన్‌ వైఖ రి వృత్తిపరమైన ప్రమాణాలను దెబ్బతీస్తుందని అనిల్‌కుమార్‌ నివేదించారు. తక్షణమే అతడిని బదిలీ చేయాలని విజ్ఙప్తి చేశారు.



Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!

Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి

Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు

For Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 04:47 AM