నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
ABN, Publish Date - Jan 28 , 2025 | 08:22 PM
కేంద్ర మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉండి బండి సంజయ్.. గద్దర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ సంస్కృతిక సారథి చైర్మన్ జీ వీ వెన్నెల ఖండించారు. పద్మ పురస్కారాలు కేంద్రం ఇస్తుందా? లేకుంటే బీజేపీ ఇస్తుందా? అని గద్దర్ కుమార్తె వెన్నెల సందేహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉండి బండి సంజయ్.. గద్దర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ సంస్కృతిక సారథి చైర్మన్ జీ వీ వెన్నెల ఖండించారు. పద్మ పురస్కారాలు కేంద్రం ఇస్తుందా? లేకుంటే బీజేపీ ఇస్తుందా? అని గద్దర్ కుమార్తె వెన్నెల సందేహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు.. తెలంగాణ సమాజంలోని కవులు, కళాకారులు, మేథావులు, విద్యార్థులను అవమాన పరిచే విధంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. పద్మ పురస్కారాలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల జీవీ వెన్నెల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇంతకీ ఈ పురస్కారాలు మీ ఇంట్లోని ఇస్తున్నారా? అని ఆమె మండిపడ్డారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 28 , 2025 | 08:23 PM