ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accidents: కుంభమేళా నుంచి తిరిగొస్తూ.. అనంతలోకాలకు

ABN, Publish Date - Feb 25 , 2025 | 04:42 AM

మహాకుంభమేళాలో పాల్గొన్ని వస్తుండగా జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కుంభమేళా నుంచి కాశీవిశ్వేశ్వరుడి దర్శనం కోసం వారణాసికి వెళ్తుండగా కారు, టిప్పర్‌ ఢీకొనడంతో సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

  • యూపీలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

  • మృతుల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన డీఈఈ వెంకట్‌ రాంరెడ్డి జంట, డ్రైవర్‌

  • నల్లగొండ జిల్లాకు చెందిన మరో మహిళ విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌

న్యాల్‌కల్‌, నల్లగొండ క్రైం, హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మహాకుంభమేళాలో పాల్గొన్ని వస్తుండగా జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కుంభమేళా నుంచి కాశీవిశ్వేశ్వరుడి దర్శనం కోసం వారణాసికి వెళ్తుండగా కారు, టిప్పర్‌ ఢీకొనడంతో సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జహీరాబాద్‌ డివిజన్‌ న్యాల్‌కల్‌ మండలం మామిడ్గికి చెందిన డీఈఈ వెంకట్‌ రాంరెడ్డి(44), అతని భార్య విలాసిని(40), విలాసిని అక్క విశాలతో పాటు మరో ముగ్గురు ఈ నెల 21న కారులో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. సోమవారం ప్రయాగ్‌రాజ్‌ నుంచి వారణాసి వెళ్తుండగా యూపీలోని మిర్జాపూర్‌ సమీపంలో వారి కారు టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీఈఈ వెంకట్‌ రాంరెడ్డి, అతని భార్య, కారు డ్రైవర్‌ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.


మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, నల్లగొండకు చెందిన రాచకొండ చంద్రశే ఖర్‌, కళావతి(45) దంపతులు, గజ్జల నాగరాజు, నాగలక్ష్మి దంపతులు, హైదరాబాద్‌లోని మరో కుటుంబానికి చెందిన ముగ్గురు కలిసి ఈ నెల 19వ తేదీన కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా యూపీలోని కట్ని ప్రాంతం సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో కళావతి(45) మృతి చెందింది. కారులో ఉన్న చంద్రశేఖర్‌, నాగరాజుకు తీవ్ర గాయాలుకాగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బంధువులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతిచెందడం పట్ల్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స, తక్షణ సహాయక చర్యల్ని అందించేందుకు యూపీ ప్రభుత్వంతో మాట్లాడాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.

Updated Date - Feb 25 , 2025 | 04:42 AM