ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Challa Vamsichand Reddy: కాంగ్రెస్‌ ‘ఈగల్‌’ కమిటీలో వంశీచంద్‌

ABN, Publish Date - Feb 03 , 2025 | 04:04 AM

ఎన్నికల పర్యవేక్షణ కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏర్పాటుచేసిన నాయకులు, నిపుణుల సాధికారత (ఎంపవర్డ్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఆఫ్‌ లీడర్స్‌ అండ్‌ ఎక్స్‌పర్ట్స్‌- ఈగల్‌) కమిటీలో తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డికి స్థానం లభించింది.

  • 8 మంది సీనియర్‌ నేతలతో కమిటీ ఏర్పాటు చేసిన అధిష్ఠానం

  • త్వరలో జరగబోయే ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల పర్యవేక్షణ కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏర్పాటుచేసిన నాయకులు, నిపుణుల సాధికారత (ఎంపవర్డ్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఆఫ్‌ లీడర్స్‌ అండ్‌ ఎక్స్‌పర్ట్స్‌- ఈగల్‌) కమిటీలో తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డికి స్థానం లభించింది. దేశంలో త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షించడంతో పాటు ఇప్పటికే ముగిసిన రాష్ట్రాల ఎన్నికల తీరుతెన్నులను ఈ కమిటీ సమీక్షిస్తుంది. కమిటీ వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ సీనియర్‌ నేతలు అజయ్‌ మాకెన్‌, దిగ్విజయ సింగ్‌, అభిషేక్‌ మను సింఘ్వీ (తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు), ప్రవీణ్‌ చక్రవర్తి, పవన్‌ ఖేరా, గురుదీప్‌ సింగ్‌ సప్పల్‌, నితిన్‌ రౌత్‌తో పాటు వంశీచంద్‌ రెడ్డికి అవకాశం కల్పించారు. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా ‘ఈగల్‌’ పేరుతో కమిటీ ఏర్పాటు చేశారని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. తొలుత మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధ్యయనం చేసి అధిష్ఠానానికి నివేదిక అందిస్తుందని తెలిపారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను కూడా సమీక్షిస్తుందన్నారు.


గొప్ప అవకాశం: వంశీచంద్‌

కాంగ్రెస్‌ నిపుణుల కమిటీలో తనకు చోటుదక్కడం గొప్ప అవకాశమని వంశీచంద్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా తదితర కీలక అంశాల పర్యవేక్షణలో కాంగ్రెస్‌ దిగ్గజ నేతలతో భాగస్వామిగా ఉండడం సదావకాశమని చెప్పారు. అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతలకు సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 04:04 AM