ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ED: ‘జేఆర్‌ ఇన్ఫినిటీ’ కేసులో 7.98 కోట్లు సీజ్‌

ABN, Publish Date - Feb 28 , 2025 | 04:58 AM

టాబ్లెట్ల రూపంలో నిషేధిత మత్తుమందులను ఆన్‌లైన్‌లో విదేశాలకు సరఫరా చేస్తూ పట్టుబడిన జేఆర్‌ ఇన్ఫినిటీ గ్రూపు యాజమాన్యం ఆ డబ్బుతో 22చోట్ల ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధికారులు గుర్తించారు.

  • డ్రగ్స్‌ డబ్బుతో 22చోట్ల స్థలాలు కొన్నట్లు గుర్తించిన ఈడీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): టాబ్లెట్ల రూపంలో నిషేధిత మత్తుమందులను ఆన్‌లైన్‌లో విదేశాలకు సరఫరా చేస్తూ పట్టుబడిన జేఆర్‌ ఇన్ఫినిటీ గ్రూపు యాజమాన్యం ఆ డబ్బుతో 22చోట్ల ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధికారులు గుర్తించారు. జేఆర్‌ గ్రూపుకు చెందిన ఆశిశ్‌ జైన్‌ పేరిట ఇందౌర్‌, హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆశిశ్‌ జైన్‌, అతని కుటుంబసభ్యులకు చెందిన రూ.7.98కోట్ల విలువైన 30 స్థిరచరాస్తులను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌ జోన్‌ ఈడీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.


హైదరాబాద్‌లో జేర్‌ ఇన్ఫినిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ప్రారంభించిన ఆశిశ్‌ జైన్‌ అల్ర్ఫాజోలం, జోల్పిడెమ్‌, లోరెజ్‌పామ్‌ తదితర మత్తుమందులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు 2022లో జేఆర్‌ ఇన్ఫినిటీ కేంద్రంపై దాడి చేసి కేసు నమోదు చేశారు. విదేశాల నుంచి మత్తుమందుల అమ్మకానికి సంబఽంధించి కోట్ల రూపాయల డబ్బు ఆశిశ్‌ బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయినట్లు గుర్తించిన ఈడీ అధికారులు ఎన్‌సిబీ కేసు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Feb 28 , 2025 | 04:58 AM