ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘డబుల్‌ డెక్కర్‌’ బస్సులో నుమాయిష్‌ వీక్షణం

ABN, Publish Date - Jan 03 , 2025 | 03:01 AM

సందర్శకులను అలరించేందుకు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) సిద్ధమైంది. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈసారి ఎగ్జిబిషన్‌ను చుట్టి వచ్చేందుకు అద్దాలతో కూడిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు.

  • ఎగ్జిబిషన్‌ను చూసేందుకు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు

  • నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

అఫ్జల్‌గంజ్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): సందర్శకులను అలరించేందుకు అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) సిద్ధమైంది. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈసారి ఎగ్జిబిషన్‌ను చుట్టి వచ్చేందుకు అద్దాలతో కూడిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. అమెరికా, బ్రిటన్‌లో మాదిరిగా సందర్శకులు వీటిలో ఎగ్జిబిషన్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చిన్న రైలుతో పాటు డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నుమాయి్‌షను ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శన ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది.


ఈసారి మాత్రం జనవరి 3 నుంచి మొదలుకానుంది. ప్రవేశ రుసుమును రూ.10 పెంచి.. రూ.50 చేశారు. కాగా, ఏటా 25 లక్షల మంది నుమాయి్‌షను సందర్శిస్తుంటారు. సుమారు 2 వేల స్టాళ్లతో కొనసాగే ఈ ఎగ్జిబిషన్‌కు జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారు కూడా వస్తుంటారు. కాగా, ఎగ్జిబిషన్‌ ద్వారా గత సంవత్సరం జీఎ్‌సటీ రూ.9.66 కోట్లు వసూలైంది. పదివేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మొత్తం 26 ఎకరాలలో ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ కోశాధికారి డాక్టర్‌ బి.ప్రభాశంకర్‌ తెలిపారు. సందర్శకుల భద్రతకు చర్యలు చేపడుతున్నామని కార్యదర్శి బి.సురేందర్‌రెడ్డి చెప్పారు. 100 సీసీ కెమెరాలు, వాచ్‌ టవర్లతో నిఘా ఉంచుతామన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 03:01 AM