DGP Jitender: మెరుగైనసేవలందించే దిశగా పోలీసులు
ABN, Publish Date - Jan 19 , 2025 | 03:41 AM
ప్రజలకు పోలీసులు మరింత మెరుగైన సేవలందించేలా తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ వినూత్న శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
శాఖ ప్రతిష్ఠను పెంచేలా కార్యక్రమం: డీజీపీ జితేందర్
హైదరాబాద్, జనవరి18(ఆంధ్రజ్యోతి): ప్రజలకు పోలీసులు మరింత మెరుగైన సేవలందించేలా తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ వినూత్న శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం డీజీపీ కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పోలీసు విభాగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం, శాఖ ప్రతిష్ఠను పెంపొందించేలా ప్రవర్తన ఉండటం, మహిళల భద్రత, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం తదితర అంశాలపై పోలీసు సిబ్బందికి సూచనలిచ్చారు. ప్రతి జిల్లా నుంచి కొంతమంది పోలీసులను ఎంపిక చేసి నూతన లక్ష్యాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
Updated Date - Jan 19 , 2025 | 03:41 AM