ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Elections: కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి సీపీఎస్‌ మద్దతు

ABN, Publish Date - Feb 25 , 2025 | 03:51 AM

కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ తెలిపారు.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ తెలిపారు. ఈ మేరకు సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబును కలిసి మద్దతు లేఖను అందజేశారు. సీపీఎస్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి స్థితప్రజ్ఞ విజ్ఞప్తి చేశారు.


పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి వారికి హామీనిచ్చారు. 60 వేల ఓట్లున్న సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల సభ్యులంతా ఓటింగ్‌లో పాల్గొనాలని ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు.

Updated Date - Feb 25 , 2025 | 03:51 AM