Sangareddy: బ్రిటిష్ విధానంలోనే బీజేపీ పాలన
ABN, Publish Date - Jan 26 , 2025 | 04:28 AM
విభజించి పాలించాలనే బ్రిటిష్ విధానాన్నే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపించారు. దేశ ప్రజలను కుల మతాల పేరిట విభజిస్తూ ప్రధాని మోదీ పరిపాలిస్తున్నారన్నారు.
కులమతాలుగా విభజించి పాలిస్తున్న మోదీ
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్
రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అడుక్కుంటున్నారు: రాఘవులు
సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర మహాసభలు ప్రారంభం
సంగారెడ్డి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విభజించి పాలించాలనే బ్రిటిష్ విధానాన్నే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపించారు. దేశ ప్రజలను కుల మతాల పేరిట విభజిస్తూ ప్రధాని మోదీ పరిపాలిస్తున్నారన్నారు. సంగారెడ్డిలో శనివారం ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీ హయాంలో పెట్టుబడిదారుల ఆస్తులు 400రెట్లు పెరిగాయని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణలో ఉన్న ఇండియా కూటమి ప్రభుత్వాలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమె అన్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఒక సీఎంగా కేంద్రాన్ని నిధుల కోసం డిమాండ్ చేయకుండా దోసిలి పట్టి అడుక్కుంటున్నారని విమర్శించారు.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 26 , 2025 | 04:28 AM