ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aadi Srinivas: బీఆర్‌ఎ్‌సతో కిషన్‌రెడ్డి లోపాయికారి ఒప్పందం

ABN, Publish Date - Jan 26 , 2025 | 03:49 AM

తెలంగాణను ప్రపంచ ఆర్థిక దిగ్గజాల ముందుంచి.. రూ.1.79 లక్షల కోట్ల మేర పెట్టుబడులు సీఎం రేవంత్‌రెడ్డి తెస్తే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వచ్చిన నొప్పి ఏంటని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ నిలదీశారు.

  • రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తేశాపనార్థాలా?: ఆది శ్రీనివాస్‌

  • కిషన్‌రెడ్డీ.. కేంద్రమంత్రివా.. పాలేరువా?: చామల

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను ప్రపంచ ఆర్థిక దిగ్గజాల ముందుంచి.. రూ.1.79 లక్షల కోట్ల మేర పెట్టుబడులు సీఎం రేవంత్‌రెడ్డి తెస్తే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వచ్చిన నొప్పి ఏంటని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ నిలదీశారు. ఆరేళ్లుగా కేంద్రమంత్రిగా ఉన్న ఆయన.. తెలంగాణకు కొత్త ప్రాజెక్టు ఏమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి.. బీఆర్‌ఎ్‌సతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నాడంటూ ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు చూసి కిషన్‌రెడ్డి గర్వించాలే కానీ.. శాపనార్థాలు పెట్టేలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.


‘నువ్వు మోదీ క్యాబినెట్లో మంత్రివా.. లేకుంటే కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో పాలేరువా? నువ్వు పెట్టుకున్న గులాబీ కళ్లజోడు తీసి చూడు..! అన్నీ సజావుగానే కనిపిస్తయి’ అంటూ కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ తొత్తులుగా ఇంకెన్ని రోజులు పనిచేస్తారంటూ కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మండిపడ్డారు. వైఎ్‌సఆర్‌కు అప్‌డేటెడ్‌ వర్షన్‌.. రేవంత్‌ అని మత్య్సకార్పొరేషన్‌ చైర్మన్‌ సాయికుమార్‌ అన్నారు.

Updated Date - Jan 26 , 2025 | 03:49 AM