ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పెట్టుబడులను చూసి కడుపు మంటా?

ABN, Publish Date - Jan 26 , 2025 | 03:39 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్‌ నేతల తీరును విమర్శిస్తూ శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు.

  • ‘ఈనో’ వాడండంటూ కాంగ్రెస్‌ ఫెక్సీలు అందులో కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్‌ నేతల తీరును విమర్శిస్తూ శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా.. ‘రాష్ట్ర అభివృద్ధికి రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారు. ఈ పెట్టుబడులు చూసి కడుపుమంటా.? వాడండి ఈనో..!’ అంటూ పేర్కొన్నారు. వాటిలోనే బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలను ప్రచురించారు.


గచ్చిబౌలి, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, నాంపల్లి, బంజారహిల్స్‌, లక్డీకపూల్‌, కొంపల్లి, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ప్లెక్సీలు, హోర్డింగ్‌లు వెలిశాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి మాట్లాడుతూ దావోస్‌ పర్యటనలో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి రేవంత్‌రెడ్డి రికార్డు సృష్టించారని తెలిపారు. దీన్ని చూసి ఓర్వలేకపోతున్న బీఆర్‌ఎస్‌ నేతలు కడుపు మంట తగ్గించుకోవడానికి ఈనో ప్యాకెట్లు వాడాలని అన్నారు. ఓటమి కుంగుబాటుతో బీఆర్‌ఎస్‌ నేతలు ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 03:39 AM