రేపు యాదగిరిగుట్టకు సీఎం
ABN, Publish Date - Feb 22 , 2025 | 04:01 AM
యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించనున్నారు. ఆ రోజు ఉదయం 11:54 గంటలకు ప్రధానాలయంలో స్వామివారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో రేవంత్ పాల్గొంటారు.
బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొననున్న రేవంత్
కేసీఆర్‌కు ఆహ్వానపత్రిక
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించనున్నారు. ఆ రోజు ఉదయం 11:54 గంటలకు ప్రధానాలయంలో స్వామివారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో రేవంత్ పాల్గొంటారు. 50.5 అడుగుల ఎత్తయిన పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఆవిష్కరిస్తారు. స్వర్ణ విమాన రాజగోపురం వద్దకు సీఎం చేరుకునేందుకు ఆలయ దక్షిణ తిరువీధుల్లో రెండు వైపులా మెట్లను ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం యాదగిరిగుట్టలో జరిగే స్వర్ణ విమాన గోపుర మహా కుంబాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం కోసం మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం వెళ్లింది.
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌ్‌సకు శుక్రవారం ఆలయ కార్యనిర్వాహక అధికారులతో కలిసి పూజారులు వెళ్లారు. కేసీఆర్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు కూడా రావాలని ఆయన్ను ఆహ్వానించారు. కాగా ఆదివారం యాదగిరిగుట్టలో ప్రత్యేక కార్యక్రమం దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంటల వరకు దర్శనాలను రద్దు చేశారు.
Updated Date - Feb 22 , 2025 | 04:01 AM