ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: నిజాయతీకి నిలువెత్తు రూపం సంజీవయ్య

ABN, Publish Date - Feb 15 , 2025 | 03:41 AM

నిజాయతీకి నిలువెత్తు రూపం.. దళితజాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.

  • సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘నిజాయతీకి నిలువెత్తు రూపం.. దళితజాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటు పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర సైనికులకు సీఎం నివాళులర్పించారు. ‘ప్రాణాన్ని ఫణంగా పెట్టి దేశాన్ని కాపాడే వీర సైనికులకు సదా సలాం.. పుల్వామా అమరులకు జోహార్లు’ అంటూ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.


వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు..

ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసిన సీఎం రేవంత్‌కు మాదిగ మేధావుల ఫోరం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. సీఎంను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఇటిక్యాల పురుషోత్తం, ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కాశీం, ప్రొఫెసర్‌ గడ్డం మల్లేశం పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 03:41 AM