ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indiramma scheme: పదేళ్ల తర్వాత పేదల కళ్లలో వెలుగులు

ABN, Publish Date - Jan 27 , 2025 | 04:23 AM

రాష్ట్రంలో పదేళ్ల తర్వాత పేదల కళ్లల్లో వెలుగులు చూస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలను ఒక ఇంటివాళ్లను చేయాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.

  • కొత్తగా మరో 4 పథకాల ప్రారంభం

  • పేదలను సంక్షేమంవైపు తీసుకెళ్తున్నాం

  • గణతంత్ర దినోత్సవ సందేశంలో సీఎం

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదేళ్ల తర్వాత పేదల కళ్లల్లో వెలుగులు చూస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలను ఒక ఇంటివాళ్లను చేయాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఓ వీడియో సందేశాన్ని సీఎం రేవంత్‌ విడుదల చేశారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తోందన్నారు. గణతంత్ర దినోవ్సవం నాడు నాలుగు కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని చెప్పారు.


రేవంత్‌ అన్నగా ప్రజల ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కక్కొటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయలేదని, వేలాది మంది పేదలకు ఊరట కల్పి స్తూ కొత్తవి మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందజేయనున్న ట్లు తెలిపారు. రైతు భరోసా కింద ఆదివారం నుంచే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వేస్తున్నామన్నారు. దళితులు, గిరిజనులు ఆదివాసీలు, బలహీన వర్గాల ప్రజలందరినీ సంక్షేమ పథం వైపు తీసుకువెళ్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల కు ఉచిత ప్రయాణం, 200యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే సిలిండర్‌ను అందజేస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు.

Updated Date - Jan 27 , 2025 | 04:23 AM