ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్జాలం.. మాంసం ముక్క.. మందిరం!

ABN, Publish Date - Feb 13 , 2025 | 03:49 AM

ఆ పిల్లికి నోట కరచుకొనేందుకు మాంసం ముక్కే దొరకాలా! దొరికింది పో.. ఆ మాంసం ముక్కను నేరుగా తెచ్చి ఆలయ ప్రాంగణంలోనే వదిలేయాలా! వదిలేసింది పో..

  • ముక్కను నోటకరచుకొచ్చి ఆలయంలో వదిలేసిన పిల్లి

  • ఇది తెలియక.. ఇతర వర్గాలవారి పనేనని భక్తుల గుస్సా

  • టప్పాచబుత్ర హనుమాన్‌ ఆలయంలో ఘటన

  • సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు

  • పిల్లి పనేనని తేలడంతో సద్దుమణిగిన అంశం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆ పిల్లికి నోట కరచుకొనేందుకు మాంసం ముక్కే దొరకాలా! దొరికింది పో.. ఆ మాంసం ముక్కను నేరుగా తెచ్చి ఆలయ ప్రాంగణంలోనే వదిలేయాలా! వదిలేసింది పో.. ఎవ్వరూ చూడని, అసలు ఆలయమే తెరుచుకోని ప్రాతఃకాలంలోనే వదిలేయాలా! మరి.. ఆ మాంసం ముక్క, ఆలయానికొచ్చిన భక్తుల కంటపడితే? టప్పాచబుత్రలోని సంకట విమోచన హనుమాన్‌ ఆలయంలో ఇదే జరిగింది. బుధవారం ఉదయం 8:30గంటలకు లోపలున్న శివాలయం వద్ద భక్తులకు మాంసం ముక్క కనిపించింది. అది పిల్లి వదిలేసిన మాంసం ముక్క అని ఎవ్వరికీ తెలియకపోవడంతో అలజడి రేగింది. ఇది.. ఇతర వర్గాలకు చెందిన వారి పనేనని.. ఆలయాన్ని అపవిత్రం చేశారని భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. వారిలో కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు.


టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్‌, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి ఏసీపీ, అడిషనల్‌ డీసీపీ, డీసీపీలూ వచ్చారు. ఆలయ పరిసరాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలించేందుకు అప్పటికప్పుడు ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పాటు చేశారు. అన్ని సీసీ కెమెరాలు పరిశీలించి.. ఓ రెండు కెమెరాల్లో పిల్లిని, అది నోట్లో మాంసం ముక్కను కరచుకొని ఆలయ ప్రాంగణం వైపు వస్తుండటాన్ని గుర్తించారు. ఉదయం 6:30 గంటలకు నోట్లో మాంసం ముక్కతో ఆలయంలోకి పిల్లి ప్రవేశించినట్లు.. కొద్దిసేపటికి ఆ ముక్కను వదిలేసి ఆ జీవి బయటకు వెళ్లిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇది తెలిసి... మార్జాలం ఎంత కంగారు పెట్టిందో కదా! అంటూ భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి ప్రార్థనా మందిరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు మన్నెంలో జాతరల సందడి

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 03:49 AM