గొలుసు దొంగను పట్టుకోబోయి... రైలు ఢీకొని
ABN, Publish Date - Feb 16 , 2025 | 04:45 AM
భార్య మెడలోని తాళిబొట్టు గొలుసును తెంచుకువెళుతున్న దొంగను పట్టుకునే క్రమంలో రైలు కిందపడి జవాన్ లక్ష్మన్న(32) మృతి చెందారు.
ఢిల్లీలో ‘అనంత’ జవాన్ మృతి
బ్రహ్మసముద్రం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): భార్య మెడలోని తాళిబొట్టు గొలుసును తెంచుకువెళుతున్న దొంగను పట్టుకునే క్రమంలో రైలు కిందపడి జవాన్ లక్ష్మన్న(32) మృతి చెందారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన లక్ష్మన్న 2014లో బీఎ్‌సఎఫ్ జవానుగా ఉద్యోగంలో చేరారు. లక్ష్మన్నకు ఐదేళ్ల క్రితం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా జయంతినగర్‌కు చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరికి కూతురు జియ(4), కుమారుడు ఇయాన్(3) ఉన్నారు.
నెల క్రితం లక్ష్మన్న సెలవుపై సొంతూరికి వచ్చారు. 16న కశ్మీర్‌లో విధుల్లో చేరాల్సిఉండడంతో బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. నిజాముద్దీన్ ఈస్ట్ రైల్వేస్టేషన్‌కు 50 కి.మీ. దూరంలో రైలు నెమ్మదిగా వెళుతోంది. ఆ సమయంలో లక్ష్మి మెడలోని బంగారు మంగళ సూత్రాన్ని ఒక దొంగ లాక్కొని పరుగులు తీశాడు. దొంగను పట్టుకునేందుకు రైలు నుంచి లక్ష్మన్న కిందకు దూకగానే పక్క ట్రాక్‌పై వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో లక్ష్మన్న అక్కడికక్కడే మృతి చెందారు.
Updated Date - Feb 16 , 2025 | 04:45 AM