Warangal: వ్యవసాయ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
ABN, Publish Date - Feb 27 , 2025 | 04:55 AM
వరంగల్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న గంటోజు రేస్మిత(19) ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం తానుంటున్నవసతిగృహం గదిలో ఫ్యానుకు ఉరేసుకుంది.
వరంగల్ వ్యవసాయం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వరంగల్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న గంటోజు రేస్మిత(19) ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం తానుంటున్నవసతిగృహం గదిలో ఫ్యానుకు ఉరేసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రాక్‌హిల్స్ కాలనీకి చెందిన రేస్మిత వరంగల్ వ్యవసాయ కళాశాలలో చదువుకుంటోంది. రేస్మితకు వరంగల్‌లో చదువుకోవడం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు నచ్చచెప్పి కళాశాలకు పంపించారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం తానుంటున్న వసతిగృహం గది తలుపులు తీయకపోవడంతో విషయం తెలుసుకున్న కళాశాల అధికారులు రేస్మిత తండ్రితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని గది తలుపులు పగులకొట్టి చూడగా అప్పటికే రేస్మిత ఫ్యాన్‌కు ఉరేసుకుంది. రేస్మిత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Feb 27 , 2025 | 04:55 AM