ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొక్కెర వ్యాధితో 12వేల కోళ్ల మృతి

ABN, Publish Date - Mar 10 , 2025 | 04:17 AM

ఒకవైపు బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తుండగా.. కొక్కెర వ్యాధి సైతం విజృంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్‌నగర్‌లో ఆదివారం ఒక్క రోజే ఏకంగా 12,200 బాయిలర్‌ కోళ్లు వీవీఎన్‌డీ(కొక్కెర)వ్యాధితో మృత్యువాత పడ్డాయి.

  • పౌలీ్ట్ర రైతుకు రూ.20 లక్షల మేర నష్టం

  • రంగారెడ్డి జిల్లా నానక్‌నగర్‌లో ఘటన

  • మెదక్‌ జిల్లాలో 3,500 నాటు కోళ్లు..

యాచారం/నర్సాపూర్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : ఒకవైపు బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తుండగా.. కొక్కెర వ్యాధి సైతం విజృంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్‌నగర్‌లో ఆదివారం ఒక్క రోజే ఏకంగా 12,200 బాయిలర్‌ కోళ్లు వీవీఎన్‌డీ(కొక్కెర)వ్యాధితో మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లిందని పౌలీ్ట్ర రైతు చల్ల కృష్ణారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఇదే గ్రామంలో రెండు రోజుల క్రితం ముత్యాల వెంకటరెడ్డికి చెందిన ఫామ్‌లో 7 వేల కోళ్లు మృతి చెందగా.. 10లక్షల వరకు నష్టం వాటిల్లింది.


ఈ విషయమై పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ కిరణ్‌ వివరణ కోరగా... ఆదివారం కోళ్లు చనిపోయినట్లు తన దృష్టికి రాలేదన్నారు. సోమవారం ఆయా గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తానని చెప్పారు. మరోవైపు.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం లింగాపూర్‌లోనూ పాతులోత్‌ ప్రసాద్‌ కోళ్ల ఫామ్‌లో 3,500 నాటు కోళ్లు అనారోగ్యానికి గురై మృతి చెందాయి. సుమారు రూ.8 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Mar 10 , 2025 | 04:17 AM