ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: పద్మ అవార్డుల్లో అన్యాయం

ABN, Publish Date - Jan 27 , 2025 | 05:47 AM

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. తెలంగాణ ఏర్పాటు, అస్తిత్వం, ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

  • తెలంగాణ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదు: భట్టి

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. తెలంగాణ ఏర్పాటు, అస్తిత్వం, ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన, సమాజం కోసం, కళల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారి పేర్లను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సిఫారసు చేస్తే.. కేంద్రం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాఽధనకు కృషి చేసిన గద్దర్‌, అందెశ్రీ, గోరేటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిందని తెలిపారు. వీరిలో ఒక్కరికి కూడా అర్హత లేదా అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Jan 27 , 2025 | 05:47 AM