ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జేఈఈలో బీసీ గురుకుల విద్యార్థుల హవా

ABN, Publish Date - Feb 13 , 2025 | 05:04 AM

ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశం కోసం(2024-25)లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ ప్రవేశపరీక్షలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధించారు.

  • అర్హత సాధించిన 27మంది బాలురు, 26మంది బాలికలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశం కోసం(2024-25)లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ ప్రవేశపరీక్షలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధించారు. ప్రవేశ పరీక్షలో ఎం.నవదీప్‌ 97.43 పర్సంటైల్‌ సాధించగా, ఎం.జాహ్నవి 92.08, స్వాతి, శ్రీకాంత్‌, ఆకాష్‌ 91, సాయి, ప్రసన్నలు 90.46 శాతం సాధించి ప్రతిభ నిరూపించుకున్నారు. బీసీ గురుకుల పాఠశాలల్లో చదివిన మొత్తం 53 మంది విద్యార్థులు అర్హత సాధించడం విశేషం.


రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి ‘కాలేజీ ఫర్‌ ఎక్సలెన్సీ’లో ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం శిక్షణ అందిస్తున్నారు. 2024-25 సంవత్సరంలో 27 మంది బాలురు, 26 మంది బాలికలు అర్హత సాధించినట్టు బీసీ గురుకుల పాఠశాలల సంస్థ అధికారులు తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కార్యదర్శి శ్రీధర్‌, కమిషనర్‌ బాలమాయ దేవి, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.

Updated Date - Feb 13 , 2025 | 05:04 AM