BC Commission: భట్టితో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల భేటీ
ABN, Publish Date - Feb 04 , 2025 | 04:01 AM
ఉపముఖ్యమంత్రి భట్టితో సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు భేటీ అయ్యారు.
కమిషన్‌కు వచ్చిన విజ్ఞప్తులపై చర్చ
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి భట్టితో సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు భేటీ అయ్యారు. సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో వారు భట్టితో సమావేశమై బీసీ కమిషన్‌కు వచ్చిన విజ్ఞప్తులపై ఆయనతో చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన కులాల పేర్ల మార్పు తదితర విజ్ఞప్తులను అమలు చేసినట్లయితే తలెత్తే పరిణామాలు, వీటిపై కమిషన్ స్వీకరించిన అభ్యంతరాలు, తదుపరి కమిషన్ సిఫారసులు ఎలా ఉన్నాయన్న విషయాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. బీసీ కమిషన్‌కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిన విషయమై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి ఉపముఖ్యమంత్రి భట్టితో చర్చించారు.
ఇవి కూడా చదవండి..
KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 04 , 2025 | 04:01 AM